దేశంలోనే అతిపెద్ద పౌల్ట్రీ ఫార్మ్ గా వెంకట రామ పౌల్ట్రిస్ ప్రైవేట్ లిమిటెడ్ కి శ్రీ రాధా మోహన్ యూనియన్ మినిస్టర్ అఫ్ లైవ్‌స్టాక్ గారి చే అవార్డు స్వీకరించిన శ్రీ పరుచూరి మధు కోణార్క్.
1979 లో వెయ్య కోళ్ల తో మొదలైన వెంకట రామ పౌల్ట్రిస్ ఈనాడు 65 లక్షల కోళ్లతో ఒకరోజుకి 40 లక్షల కోడి గుడ్లు ఉత్పత్తితో దేశంలోనే అతిపెద్ద పౌల్ట్రీ ఫార్మ్ గా నిలచింది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు మరియు ఈస్ట్ ఆఫ్రికా లోని టాంజానియాలో 4,000 సిబ్బందితో కార్పొరేట్ తరహాలో లేటెస్ట్ టెక్నాలజీ తో సక్సెస్‌ఫుల్‌గా నడపబడుతుంది.
అవార్డు వచ్చిన సందర్భంగా చైర్మన్ శ్రీ పరుచూరి వెంకట రావుగారు, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ పరుచూరి ధర్మ తేజ గారు , వెంకట రామ పౌల్ట్రిస్ సిబ్బందికి, సక్కు గ్రూప్ అఫ్ కంపెనీస్ సిబ్బందికి, బ్యాంకర్స్ కి, ఇతర స్టాక్హోల్డ్ర్లుకి కృతజ్ఞతులు తెలిపారు.